తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొరియా ఓపెన్: సెమీస్​కు చేరిన కశ్యప్ - parupalli kashyap badminton

కొరియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో సెమీ ఫైనల్​కు చేరాడు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్. అందులో జపాన్ ఆటగాడు కెంటో మొమొటతో తలపడనున్నాడు.

కశ్యప్

By

Published : Sep 27, 2019, 4:21 PM IST

Updated : Oct 2, 2019, 5:36 AM IST

కొరియా ఓపెన్​లో భారత షట్లర్​ పారుపల్లి కశ్యప్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో డెన్మార్క్ ఆటగాడు జోర్గెన్​సన్​పై 24-22, 21-8 తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్​లో అడుగుపెట్టాడు. కశ్యప్ జోరుకు జోర్గెన్​సన్ దగ్గర సమాధానమే లేకపోయింది. ఈ మ్యాచ్​ 37 నిమిషాల్లో ముగిసింది.

తొలి సెట్​లో​ ప్రత్యర్థి బలమైన పోటీ ఇచ్చినా.. రెండో సెట్​లో కశ్యప్ జోరు కొనసాగించాడు. జోర్గెన్​సన్​కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అలవోకగా మ్యాచ్​ సొంతం చేసుకున్నాడు.

సెమీస్​లో ప్రపంచ నంబర్​వన్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్​ అయినా జపాన్ ఆటగాడు కెంటో మొమొటతో తలపడనున్నాడు కశ్యప్.

ఇవీ చూడండి.. ఆరంభంలోనే హడలెత్తించిన​ మలింగ వారసుడు..!

Last Updated : Oct 2, 2019, 5:36 AM IST

ABOUT THE AUTHOR

...view details