భారత టాప్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హెచ్ ఎస్ ప్రణయ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరితో పాటు గురుసాయి దత్, డబుల్స్ స్పెషలిస్ట్ ప్రణవ్ చోప్రాకు కూడా కరోనా సోకింది. అయితే వీరెవరికీ లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం.. ఈ ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
షట్లర్లు కశ్యప్, ప్రణయ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా
ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కశ్యప్, ప్రణయ్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు కొవిడ్ సోకింది.
కశ్యప్, ప్రణయ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
కశ్యప్ సతీమణి, షట్లర్ సైనా నెహ్వాల్‌కు మాత్రం రిపోర్టు నెగెటివ్‌గా వచ్చిందని గోపీచంద్ అకాడమీలోని ఓ సభ్యుడు వెల్లడించాడు. ఆటగాళ్లంతా సోమవారం మరోసారి టెస్టులు చేయించుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:''కంకషన్ సబ్‌స్టిట్యూట్'ను దుర్వినియోగం చేయొద్దు'