తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నైపుణ్యమున్న వారికి మా అకాడమీలో చోటు పక్కా'

స్టార్ షట్లర్ గుత్తా జ్వాల.. హైదరాబాద్​లో క్రీడా అకాడమీ ఏర్పాటు చేశారు. నైపుణ్యమున్న వారికి తన అకాడమీలో తప్పకుండా చోటు కల్పిస్తామని అన్నారు.

నైపుణ్యమున్న వారికి మా అకాడమీలో చోటు:గుత్తా జ్వాల
గుత్తా జ్వాల క్రీడా అకాడమీ ప్రారంభం

By

Published : Dec 10, 2019, 7:06 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల.. హైదరాబాద్​లో క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. 'గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌' పేరుతో ప్రారంభంచనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లోగోను దిల్లీలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌రూడీ, బాక్సర్‌ విజేందర్‌సింగ్‌, రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ ఆవిష్కరించారు. తొలుత 14 బ్యాడ్మింటన్‌ కోర్టులతో అకాడమీని ప్రారంభించనున్నారు. తర్వాత మిగిలిన కొన్ని క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందించనున్నారు.

అకాడమీ టీషర్టులు ఆవిష్కరిస్తున్న గుత్తా జ్వాల

"అమ్మానాన్నల ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ సుజాత విద్యాసంస్థలో అకాడమీ ఏర్పాటు చేశా. విశాలమైన మైదానంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటైంది. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేలా శిక్షణ ఇస్తాం. నైపుణ్యం ఉన్నవాళ్లకు మా అకాడమీలో తప్పకుండా ప్రాధాన్యం ఉంటుంది. బ్యాడ్మింటన్‌ తర్వాత స్మిమ్మింగ్‌, క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ సహా పలు క్రీడల్లో శిక్షణ ఇస్తాం" -గుత్తా జ్వాల, ప్రముఖ షట్లర్

'దిశ'కు సరైన న్యాయం జరగలేదు

నా దృష్టిలో దిశకు సరైన న్యాయం జరగలేదని గుత్తా జ్వాల అన్నారు. ఎన్‌కౌంటర్లు, ఉరిశిక్షలు అత్యాచారాలను ఆపలేవని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు కల్పించి సమాజంలో మార్పు తెచ్చినపుడే అత్యాచారాలు తగ్గుతాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details