టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహకాలను కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చెప్పడం జోక్‌గా అనిపిస్తోందని భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు.
"క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం అందరూ ఒలింపిక్స్ సన్నాహకాలు కొనసాగించాలని ఐఓసీ అంటోంది. కానీ ఎలా? ఎక్కడ? ఇదో జోక్‌లా ఉంది.. ఎవరు టోక్యోకు వెళుతున్నారో ఇంకా తెలియదు. అర్హత సాధించే అవకాశం ఉన్నవాళ్లకు శిక్షణ పొందడానికి శిబిరం లేదు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను ఐఓసీ శిక్షణ కొనసాగించడమనడంలో అర్థమే లేదు"