తెలంగాణ

telangana

ETV Bharat / sports

జపాన్​ ఓపెన్​: భారత షట్లర్లకు మళ్లీ నిరాశే - కెంటో మెమోటో(జపాన్​) vs సాయి ప్రణీత్​

జపాన్​ ఓపెన్​లో భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్​లో పతకంపై ఆశలు రేపిన సాయి ప్రణీత్​ సెమీఫైనల్లో ​ఓడిపోయాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో ప్రపంచ నెంబర్​వన్ కెంటో మెమోటో(జపాన్​) చేతిలో పరాజయం చెందాడు.

జపాన్​ ఓపెన్​: భారత కథ ​ముగిసే...

By

Published : Jul 27, 2019, 1:51 PM IST

సెమీఫైనల్​లో సాయి ప్రణీత్ ఓటమితో జపాన్​ ఓపెన్​లో భారత పోరాటం ముగిసింది.​ టోక్యో వేదికగా శనివారం ఉత్కంఠగా జరిగిన పోరులో స్థానిక ఆటగాడు, నెంబర్​ వన్​ షట్లర్​ కెంటో మెమోటో చేతిలో ఓడిపోయాడు ప్రణీత్​. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన భారత ఆటగాడు.. రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేశాడు. కేవలం 45 నిమిషాల్లోనే మ్యాచ్​ ముగిసింది. 18-21, 12-21 తేడాతో చిత్తయ్యాడు.

సాయి ప్రణీత్, కెంటో మెమోటో

ఆరంభం బాగానే...

మొదటి రౌండ్​ ప్రారంభంలో 3-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు ప్రణీత్‌ . తర్వాత మెమోటో వరుసగా పాయింట్లు సాధించి లీడ్​లోకి వచ్చాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయాడు ప్రణీత్‌. ఫలితంగా సెమీస్​లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు తెలుగు తేజం. సాయినిఅలవోకగా ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లాడు నెంబర్​వన్​ ప్లేయర్​. ఇండోనేసియా ఓపెన్​లోనూ ఇదే ఆటగాడి చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు ప్రణీత్​.

మహిళల సింగిల్స్​ క్వార్టర్స్​లో అకానే యమగూచి (ఇండోనేసియా) చేతిలో పీవీ సింధు ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో క్వార్టర్​ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు భారత ద్వయం సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి.

ఇవీ చూడండి...జపాన్​ ఓపెన్​: క్వార్టర్స్​కే పరిమితమైన సింధు

ABOUT THE AUTHOR

...view details