గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బ్యాడ్మింటన్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే అకాడమీతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది.
ఇందుకు సంబంధించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి, ప్రకాశ్ పదుకొనే బెంగళూరులో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అకాడమీకీ ఐదేళ్లకు గానూ 16 కోట్లను సమకూర్చనుంది ఇన్ఫోసిస్ ఫౌండేషన్.
"ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఐదేళ్లకు 16 కోట్లు. వారు ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారు, ఎలా శిక్షణ ఇస్తారన్నది అకాడమీ ఇష్టం. ఫలితం మాత్రం అద్భుతంగా ఉండాలి. దేశంలోని క్రీడాకారుల ప్రతిభను బయటకు తీయాలి."