pv Sindhu enters quarter finals: ఇండోనేషియా ఓపెన్‌లో భాగంగా నేడు(గురువారం) జరిగిన పోరులో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. జర్మనీ ప్లేయర్ వొన్ని లిపై(Yvonne Li) 21-12, 21-18 తేడాతో విజయం సాధించింది. 37 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్. అంతకుముందు బుధవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి అయా ఒహోరిపై 17-21, 21-17, 21-17 తేడాతో గెలిచింది.
PV sindhu quarter final: క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు అర్హత - Sindhu enters quarter finals
ఇండోనేషియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(pv sindhu enters quarter finals) క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. జర్మనీ ప్లేయర్ వొన్ని లిపై(Yvonne Li) 21-12, 21-18 తేడాతో గెలుపొందింది.
పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్
మరి కాసేపట్లో భారత ప్లేయర్లు సాయిప్రణీత్.. ఫ్రెంచ్ ప్లేయర్ క్రిస్ట్రో(Christo Popov) తలపడనుండగా.. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. దక్షిణకొరియా ఆటగాళ్లు కంగ్-సియోతో(Kang Minhyuk-Seo Seungjae) పోటీ పడనున్నారు.
ఇదీ చూడండి: బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సింధు