తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి రౌండ్​లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఔట్ - sports news latest

భారత షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్, సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ.. 'ఇండోనేసియా మాస్టర్స్​'లో తొలి రౌండ్​లోనే ఓడి, ఇంటి ముఖం పట్టారు.

తొలి రౌండ్​లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఔట్
భారత షట్లర్ సైనా నెహ్వాల్

By

Published : Jan 15, 2020, 5:34 PM IST

'ఇండోనేసియా మాస్టర్స్​'లో డిఫెండింగ్ ఛాంపియన్, భారత స్టార్ షట్లర్​ సైనా నెహ్వాల్​కు చుక్కెదురైంది. తొలి రౌండ్​లో జపాన్​కు చెందిన సయాకా తకాసి చేతిలో ఓడిపోయింది. ఈమెతో పాటే సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మ.. టోర్నీ నుంచి నిష్క్రమించారు.

గతేడాది ఈ టోర్నీ విజేతగా నిలిచిన సైనా.. బుధవారం జరిగిన తొలిరౌండ్​​లో 19-21, 13-21, 5-21 తేడాతో పరాజయం పాలైంది. ఈ గేమ్ 50 నిమిషాల్లోనే ముగిసింది. గత వారం జరిగిన 'మలేసియా మాస్టర్స్' క్వార్టర్స్​లో ఓడిపోయింది సైనా.

భారత షట్లర్లు శ్రీకాంత్, సాయి ప్రణీత్

పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్.. 21-18, 12-21, 14-21 తేడాతో, సాయి ప్రణీత్.. 21-16, 18-21, 10-21 తేడాతో, సారభ్ వర్మ.. 21-17, 15-21, 10-21 తేడాతో ఓటమి పాలయ్యారు. మిక్స్​డ్ డబుల్స్​లో ప్రణవ్-సిక్కిరెడ్డి జోడీ.. దక్షిణా కొరియాకు చెందిన కో సంగ్-ఎమ్ హ్యవాన్ చేతిలో 8-21, 14-21 తేడాతో ఓడింది.

ఇది చదవండి: కోర్టులో నిర్వాహకులకు షాకిచ్చిన సైనా నెహ్వాల్

ABOUT THE AUTHOR

...view details