జకర్తా వేదికగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ నేడు ప్రారంభం కానుంది. ఇందులో భారత దిగ్గజ బ్యాడ్మింటన్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ టోర్నీలో వీరిద్దరూ పరస్పరం తలపడే అవకాశముంది. ఈ క్రీడాకారిణులిద్దరూ తొలి రౌండ్ దాటితే.. రెండో రౌండ్లో ఒకరికొకరు ఎదురుపడతారు. ప్రపంచ ఛాంపియన్ సింధు టైటిలే లక్ష్యంగా బరిలో దిగనుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ సైనా ట్రోఫీని కాపాడుకునేందుకు ప్రయత్నించనుంది.
అంతర్జాతీయ టోర్నీల్లో ముఖాముఖి పోరులో సింధుపై 3-1 తేడాతో సైనా పైచేయిలో ఉంది. ఈ ఏడాది జరిగిన తొలి టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సైనా, సింధు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.