ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. కొవిడ్ సోకినట్లుగా భావిస్తున్న షట్లర్లతో పాటు సహాయ సిబ్బందికి.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(డబ్ల్యూబీఎఫ్) మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ దఫా వారందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో టోర్నీలో పాల్గొనడానికి భారత ప్లేయర్లకు మార్గం సుగమమైంది.
ఇంగ్లాండ్ టోర్నీకి లైన్ క్లియర్- భారత షట్లర్లకు నెగెటివ్
ఆల్ ఇండియా ఓపెన్‌లో ఆడటానికి భారత షట్లర్లు సిద్ధమయ్యారు. రెండో దఫా నిర్వహించిన కొవిడ్ టెస్టులో ముగ్గురు ఇండియా ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి నెగెటివ్ నివేదిక వచ్చినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ధ్రువీకరించింది.
ఇంగ్లాండ్ టోర్నీకి లైన్ క్లియర్.. భారత షట్లర్లకు నెగెటివ్
"భారత షట్లర్లలో ఏ ఒక్క ఆటగాడికీ కొవిడ్ సోకలేదు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌కు మేము సిద్ధం" అని భారత జట్టు కోచ్ మథియాస్ బూ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. "తదుపరి నిర్వహించిన పరీక్షల తర్వాత జట్టు సభ్యులందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది." అని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య, ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ధ్రువీకరించాయి.
Last Updated : Mar 17, 2021, 6:47 PM IST