భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్ సైనా 21-10, 21-19తో మరియా యులితినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది.
స్పెయిన్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో సైనా, సమీర్, అజయ్ - Saina Nehwal reached the quarter-finals of the Spanish Masters Badminton Tournament.
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, సమీర్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.
![స్పెయిన్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో సైనా, సమీర్, అజయ్ saina](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6147452-107-6147452-1582250923805.jpg)
స్పెయిన్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో సైనా
పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ, అజయ్ జయరాం క్వార్టర్స్ చేరుకోగా.. కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో సమీర్ 21-14, 16-21, 21-15తో షెఫర్ (జర్మనీ)పై, జయరాం 21-6, 21-17తో మూడో సీడ్ శ్రీకాంత్‌పై నెగ్గారు.
ఇదీ చూడండి :లంచ్ బ్రేక్ : తడబడుతోన్న భారత బ్యాట్స్‌మెన్
Last Updated : Mar 2, 2020, 12:55 AM IST