తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాసియా పోటీలు: బ్యాడ్మింటన్​లో భారత్​కు 8 పతకాలు​

నేపాల్​లో జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో​ భారత్ షట్లర్లు​ సత్తా చాటారు. సింగిల్స్​, డబుల్స్​ విభాగాల్లో కలిపి మొత్తం 8 మంది, సెమీఫైనల్​కు చేరుకుని పతకాలు ఖరారు చేసుకున్నారు.

Indian shuttlers assure eight medals at South Asian Games
బ్యాడ్మింటన్​లో భారత్​కు 8 పతకాలు​

By

Published : Dec 4, 2019, 8:59 PM IST

13వ దక్షిణాసియా పోటీల్లోని బాడ్మింటన్​ విభాగంలో భారత్​కు 8 పతకాలు ఖరారయ్యాయి. నేపాల్​లో ఈ టోర్నీ జరుగుతోంది. బుధవారం జరిగిన సింగిల్స్​, డబుల్స్ విభాగాల్లో 8 మంది భారత​ షట్లర్లు సెమీఫైనల్​కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్​ క్వార్టర్​ ఫైనల్స్​లో పాక్​​కు చెందిన మురాద్​ అలీపై 21-12,21-17 తేడాతో భారత్​ షట్లర్​ సిరిల్​ వర్మ గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో 16 ఏళ్ల గాయత్రి గోపీచంద్.. మహూర్ షాజాద్‌(పాకిస్థాన్‌)ను 21-15 21-16 తేడాతో ఓడించి.. ఘనవిజయం సాధించింది.

మిగతా వారిలో అస్మిత చలిహా, ఆర్యమన్​ టండన్, డబుల్స్​లో కుహూ గార్గ్​- అనౌష్కా పరిఖ్​, మేఘనా జక్కంపూడి- ఎస్​ నీలకుర్తి సెమీఫైనల్స్​కు చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలా-మేఘన, పురుషుల డబుల్స్​లో కృష్ణ- కపిలా పతకాలను ఖరారు చేసుకున్నారు.

ఇది చదవండి: బీసీసీఐ నూతన చీఫ్ సెలక్టర్​ అతడేనా?

ABOUT THE AUTHOR

...view details