భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకెళ్తోంది. స్వర్ణపతకంపై గురిపెట్టిన ఈ షట్లర్.. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిక్ఫెల్ట్ను వరుస సెట్లలో చిత్తు చేసింది.
మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13 తేడాతో గెలిచింది.
క్వార్టర్స్‌లో సింధుకు.. జపాన్ షట్లర్ అకానె యమగూచి ఎదురయ్యే అవకాశముంది.
సింధుపైనే పతక ఆశలు..
26 ఏళ్ల ఈ భారత స్టార్ షట్లర్.. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత. బ్యాడ్మింటన్‌లో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో ఇంకా నిలిచింది సింధు మాత్రమే. ఈమెపైనే భారీగా అంచనాలున్నాయి.
పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి ద్వయం.. మూడింట రెండు గెలిచినా క్వార్టర్స్ చేరుకోలేక నిష్క్రమించింది.
ఇదీ చూడండి: నిరాడంబరతకు నిలువుటద్దం ఈ 'మణిపూస'