తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ బ్యాడ్మింటన్​ ప్లేయర్ మృతి

ప్రముఖ భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​ నందు నాటేకర్​(88) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

nandu natekar
నందు నాటేకర్​

By

Published : Jul 28, 2021, 11:49 AM IST

భారత లెజెండరీ షట్లర్​ నందు నాటేకర్​(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు గౌరవ్​ వెల్లడించారు. "గత మూడు నెలల నుంచి నాన్న ఆరోగ్యం కొంచెం కొంచెంగా క్షీణిస్తూ వచ్చింది. నేడు(జులై 28) ఆయన కన్నుమూశారు" అని గౌరవ్ చెప్పారు. నందు మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

నాటేకర్​.. మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించారు. 15 ఏళ్ల కెరీర్​లో 100 జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్​ను అందుకున్నారు. 1961లో అర్జున అవార్డు ఆయనను వరించింది.

1954లో ప్రతిష్ఠాత్మక ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​లో క్వార్టర్​ ఫైనల్​కు చేరుకున్నారు. 1956 మలేసియాలోని ఈవెంట్​లో గెలిచి.. అంతర్జాతీయ ఈవెంట్​లో​ విజయం సాధించిన తొలి భారత ప్లేయర్​గా రికార్డుకెక్కారు. 1951, 1963 మధ్య జరిగిన థామస్​ కప్​లో 16 డబుల్స్​ మ్యాచుల్లో 8, 16 సింగిల్స్​ మ్యాచుల్లో 12 గెలిచారు. 1965 కామన్వెల్త్​ గేమ్స్​లోనూ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాకు షాకిచ్చిన ఇంగ్లాండ్ మాజీ​ క్రికెటర్​ మృతి

ABOUT THE AUTHOR

...view details