తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్​షిప్ భారత్​లోనే..

2026 ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ (World Badminton Championship)కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(BWF) వెల్లడించింది.

World Badminton Championship, World Badminton Federation
ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​, ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య

By

Published : Jul 14, 2021, 7:46 AM IST

భారత్‌ వేదికగా మరో మెగా టోర్నీ జరగబోతోంది. 2026 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ (World Badminton Championship)కు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ జరగనుండడం ఇది రెండోసారి మాత్రమే. 2009లో హైదరాబాద్‌ వేదికగా తొలిసారి ఈ టోర్నీని నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం 2023 సుదిర్మన్‌ కప్‌ భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ ఆ అవకాశాన్ని ప్రపంచ బ్యాడ్యింటన్‌ సమాఖ్య (BWF) చైనాకు ఇచ్చింది.

కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది చైనాలో జరగాల్సిన సుదిర్మన్‌ కప్‌ను ఫిన్లాండ్‌కు తరలించింది. 2023 సుదిర్మన్‌ కప్‌ ఆతిథ్య హక్కులను వదులుకున్న భారత్‌ 2026 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించేందుకు అంగీకారం తెలిపిందని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది.

ఇదీ చదవండి:Tokyo Olympics: అథ్లెటిక్స్​లో పతక కరవు తీరేనా?

ABOUT THE AUTHOR

...view details