తన విజయం వెనుక తల్లిదండ్రుల అంతులేని కృషి దాగుందనిభారత్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా చెప్పింది. ఒక అమ్మాయిగా ఆటను నేర్చుకోవడమే కాకుండా మహిళలపై ఉన్న వివక్షపై పోరాడాల్సి వచ్చిందని తెలిపింది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఆరేళ్ల వయసు నుంచే టెన్నిస్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది సానియా. హైదరాబాద్ నుంచి ఓ అమ్మాయి టెన్నిస్ ఆడుతుందని తెలియగానే చాలా మంది హేళన చేశారని గుర్తుచేసుకుందీ స్టార్ ప్లేయర్. దేశం కోసం పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఒకవేళ అబ్బాయిగా పుట్టుంటే మంచి క్రికెటర్ అయ్యుండేదానినంది.
అక్కడ ఎవ్వరూ లేరు..
హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా... పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడింది. అయితే వీళ్లిద్దరికీ ఎప్పుడు, ఎక్కడ పరిచయం? ఎలా ప్రేమలో పడ్డారు? అన్నది అభిమానులకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. తామిద్దరం ఎలా దగ్గరైంది చెప్పలేదు కానీ, తొలిసారి ఎక్కడ, ఎలా కలుసుకున్నది మాత్రం ఈ కార్యక్రమంలో వెల్లడించింది సానియా.