టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లీగ్ దశలో సులువైన డ్రా లభించటంపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హర్షం వ్యక్తం చేసింది. అయితే ఒలింపిక్స్‌లో ప్రతి మ్యాచ్, ప్రతి పాయింట్ ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది. ఈసారి అంత సులువు ఏం కాదని అభిప్రాయపడింది.
మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్‌గా బరిలో ఉన్న సింధు.. ప్రపంచ నంబర్.34 చిగ్ గన్ యై, సెనియా పొలికర్పొవా(ఇజ్రాయెల్)తో లీగ్ దశలో తలపడనుంది.
"లీగ్ స్టేజ్‌లో మంచి డ్రా లభించింది. హాంకాంగ్ క్రీడాకారిణితో మ్యాచ్‌గా అద్భుతంగా ఉండనుంది. ప్రతి ఒక్కరు టాప్ ఫామ్‌లో దూసుకెళ్తున్నారు. నేను కూడా బాగా ఆడతానని అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యం. ఇది ఒలింపిక్స్. ఈసారి అంత సులువు ఏం కాదు"
-- పీవీ సింధు, భారత స్టార్ షట్లర్
గ్రూప్ దశలో ప్రత్యర్థులు చిగ్ గన్ యై, సెనియా పొలికర్పొవాలతో గతంలో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన రికార్డు సింధుకు ఉంది.