తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిట్​గా ఉన్నా.. కోచ్​ గోపీతో గొడవల్లేవు: సింధు - pv sindhu olympics

కోర్టులో దిగేందుకు సిద్ధమని చెప్పిన పీవీ సింధు.. తనకు కోచ్​ గోపీచంద్​తో ఎలాంటి గొడవల్లేవి తెలిపింది. వీటితో పాటే తన జీవితానికి సంబంధించిన పలు అంశాల గురించి వివరణ ఇచ్చింది.

I am now fit on court and ready to go: PV Sindhu
ఫిట్​గా ఉన్నా.. కోచ్​ గోపీచంద్​తో గొడవల్లేవు: సింధు

By

Published : Nov 6, 2020, 1:46 PM IST

Updated : Nov 6, 2020, 8:26 PM IST

రిటైర్మెంట్​ అంటూ అభిమానులకు ఇటీవలే 'మినీ హార్ట్ ఎటాక్' తెప్పించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. పూర్తి ఫిట్​గా ఉన్నానని చెప్పింది. అలానే కోర్టులో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దీనితోపాటే లాక్​డౌన్​, ఒలింపిక్స్ వాయిదా, ఆసియా కప్​ కోసం శిక్షణ, కోచ్​ గోపీచంద్​తో ఉన్న బంధం గురించి మాట్లాడింది.​

పీవీ సింధు
  1. దినచర్యను ఒక్కసారిగా ఆపేయమంటే ఎవరికైనా కష్టమే. కానీ కరోనా వల్ల వచ్చిన లాక్​డౌన్​​​, ఇదే విషయాన్ని ఎంత ముఖ్యమో చెప్పింది. మనల్ని మనం కాపాడుకోవాలని గుర్తు చేసింది. మార్చి నుంచి ఇంట్లోనే ఉన్న నేను వర్కౌట్లతో పాటు కుటుంబంతో సమయాన్ని గడిపాను. పెయింటింగ్స్ వేశాను.
  2. కొన్ని నెలల ముందు ప్రాక్టీసు తిరిగి మొదలుపెట్టినప్పుడు ఆడలేకపోయాను. కానీ ఇప్పుడు ఫిట్​గా ఉన్నాను. కోర్టులో ఆడేందుకు సిద్ధంగానూ ఉన్నాను.
  3. కరోనా ప్రభావం మొదలైనప్పుడే టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడుతుందని అనుకున్నాను. దానికి ముందుగానే సిద్ధమవడం వల్ల భయపడాల్సిన అవసరం రాలేదు. ఈ విరామం నా ఆటలో మార్పేం తీసుకురాదు. వచ్చే ఏడాది జరిగే ఈ పోటీల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో దిగుతాను.
    షట్లర్ పీవీ సింధు
  4. ఆసియా కప్​ టోర్నీకి చాలా ఎదురుచూస్తున్నా. చాలాకాలం తర్వాత కోర్టులో అడుగుపెట్టనున్నా. శిక్షణ బాగానే సాగుతోంది. లాక్​డౌన్ విరామం వల్ల మానసికంగా మెరుగయ్యా.
  5. గోపీసార్​తో(కోచ్ గోపీచంద్) నాకు ఎలాంటి గొడవలు లేవు. ఆయన నాకు ఆటలో చాలా సహాయం చేశారు. ఇంగ్లాండ్​లో శిక్షణ తీసుకుంటాననే విషయాన్ని కూడా ఆయనకు ముందుగానే చెప్పా.
    కోచ్ గోపీచంద్​తో పీవీ సింధు
  6. నెగిటివిటీ, కొవిడ్ పరిస్థితుల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నా. ఆరోజు పోస్ట్ చేశా. పూర్తిగా చదివితే మీకే అర్ధమవుతుంది. అందరూ ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించాలనే ఇలా ట్వీట్ చేశా. ఈ లాక్​డౌన్​లో నెగిటివిటీ, భయం, అనిశ్చితి లాంటి విషయాలు నన్ను చాలా భయపెట్టాయి.
Last Updated : Nov 6, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details