తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాంకాంగ్‌ ఓపెన్‌: సెమీస్‌లో శ్రీకాంత్​కు నిరాశ - Super 500 tournament

హాంకాంగ్​ ఓపెన్​లో భారత షట్లర్ల కథ ముగిసింది. సూపర్​ 500 టోర్నీలో పతకంపై ఆశలు కల్పించిన కిదాంబి శ్రీకాంత్​.. శనివారం జరిగిన సెమీస్​లో ఓటమిపాలయ్యాడు. ప్రత్యర్థి లీ చెక్​ యూ(హాంకాంగ్​)చేతిలో పోరాడి ఓడాడు.

హాంకాంగ్‌ ఓపెన్‌: సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌

By

Published : Nov 16, 2019, 8:04 PM IST

హాంకాంగ్​ ఓపెన్​లో భారత్​ పతక ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల సింగిల్స్​లో సెమీఫైనల్​ చేరిన కిందాంబి శ్రీకాంత్​... శనివారం ఇంటిముఖం పట్టాడు. తాజాగా జరిగిన సూపర్​ 500 టోర్నీ సెమీస్​ మ్యాచ్​లో.. లీ చెక్​ యూ(హాంకాంగ్​)చేతిలో 15-20, 23-25 తేడాతో ఓడిపోయాడు శ్రీకాంత్​. తనకన్నా తక్కువ ర్యాంకు ఆటగాడితో తలపడిన ఈ భారత షట్లర్​.. 42 నిమిషాలు పోరాడాడు.

టోర్నీలో మెరుగ్గా...

ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్​ కెంటో మొమొటా నుంచి బై అందుకున్న శ్రీకాంత్​.. మూడో గేమ్​లో భారత ఆటగాడు సౌరభ్​ వర్మను ఓడించాడు. క్వార్టర్స్​లో ఒలింపిక్​ ఛాంపియన్​ చెన్​ లాంగ్​ గాయం కారణంగా మ్యాచ్​ మధ్యలో తప్పుకోవడం వల్ల శ్రీకాంత్​ సెమీస్​ చేరాడు. ఫలితంగా మార్చిలో ఇండియా ఓపెన్​ తర్వాత తొలిసారి ఓ టోర్నీలో సెమీఫైనల్​ చేరాడు.

ఈ ఓపెన్​లో భారత స్టార్ షట్లర్లు తీవ్రంగా నిరాశపర్చారు. మహిళల సింగిల్స్​లో సైనా, సింధు, పురుషుల సింగిల్స్​లో హెచ్​ఎస్​ ప్రణయ్​, సమీర్​ వర్మ, పారుపల్లి కశ్యప్​, సౌరభ్​ వర్మ సత్తా చాటలేకపోయారు. టాప్​ డబుల్స్​ జోడీ, ప్రపంచ నెం.7 సాత్విక్​-చిరాగ్​ జోడీ కూడా తొలి రౌండ్​లోనే ఓటమిపాలయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details