తెలంగాణ

telangana

ETV Bharat / sports

హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌: రీఎంట్రీలో సానియా శుభారంభం - సానియా మీర్జా టెన్నిస్​

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా విజయంతో పునరాగమనం చేసింది. రెండేళ్ల తర్వాత ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ ప్లేయర్​.. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో శుభారంభం అందుకుంది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌లో నెగ్గి క్వార్టర్స్​ చేరింది సానియా జోడీ.

Hobart International 2020: Sania Mirza Enters Womens Doubles Quarterfinals
హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌: రీఎంట్రీలో సానియా అదుర్స్​... క్వార్టర్స్​ చేరిక

By

Published : Jan 15, 2020, 9:36 AM IST

Updated : Jan 15, 2020, 11:41 AM IST

టెన్నిస్​ అగ్ర క్రీడాకారిణి సానియా మీర్జా... దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. పునరాగమనం చేస్తూనే అద్భుతమైన విజయం అందుకుంది. ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగిన హోబర్ట్​ ఇంటర్నేషనల్​ టోర్నీ డబుల్స్​ విభాగంలో విజయం నమోదు చేసింది.

తొలి రౌండ్లో సానియా- నదియా (ఉక్రెయిన్‌) 2-6, 7-6 (3), 10-3తో ఓక్సానా (జార్జియా)- మియు (జపాన్‌)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో వేనియా కింగ్‌- క్రిస్టినా మెక్‌హేల్‌ (అమెరికా) జంటతో సానియా జోడీ తలపడుతుంది.

"నా జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఇదొకటి. తల్లిదండ్రులు, బుల్లి తనయుడి సమక్షంలో మ్యాచ్‌ ఆడి గెలవడం ఆనందంగా ఉంది" అని ట్విటర్‌లో సానియా పేర్కొంది.

తనయుడు ఇషాన్​తో సానియా

ఈ టోర్నీకి ముందు సానియా చివరిగా 2017 అక్టోబరులో చైనా ఓపెన్‌ ఆడింది. మోకాలి గాయం.. ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కారణంగా ఆటకు దూరమైంది.

Last Updated : Jan 15, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details