తన కరోనా పరీక్షల నివేదిక ఇంకా రాలేదని చెప్పింది భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. అధికారుల ద్వారానే తనకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తెలిసిందని వెల్లడించింది. 5 గంటల్లో వైరస్ ఫలితాలు రావాల్సి ఉన్నా.. తన విషయంలో అలా జరగలేదని తెలిపింది.
"నిన్న(సోమవారం) జరిగిన కొవిడ్ నిర్ధరణ పరీక్షల నివేదిక ఇంతవరకు రాలేదు. అంతా గందరగోళంగా ఉంది. ఈ రోజు మ్యాచ్ వార్మప్ ముందు.. నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పి, బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి వెళ్లమన్నారు. మరో 5 గంటల్లో రిపోర్టు రావాల్సి ఉంది."