తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిలకడగా రాణిస్తేనే ఒలింపిక్స్​కు..! - థాయ్​లాండ్ మాస్టర్స్​లో సైనా శ్రీకాంత్

భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్​కు ఒలింపిక్ ఆశలు దూరంగా కనిపిస్తున్నాయి. వీరు ఈ మెగాటోర్నీలో అవకాశం దక్కించుకోవాలంటే బుధవారం నుంచి ఆరంభమయ్యే థాయ్​లాండ్ మాస్టర్స్ నుంచి నిలకడగా విజయాలు సాధించాలి.

Thailand
Thailand

By

Published : Jan 21, 2020, 6:50 PM IST

Updated : Feb 17, 2020, 9:33 PM IST

రెండేళ్ల క్రితం వరుస పతకాలతో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు దుమ్మురేపారు. హఠాత్తుగా ఏమైందో తెలియదు గానీ గతేడాది మొదటి, రెండో రౌండ్లోనే వెనుదిరిగారు. 2020లోనూ ఎవరికీ శుభారంభం దక్కలేదు. బుధవారం నుంచి ఆరంభమయ్యే థాయ్‌లాండ్ మాస్టర్స్‌ సూపర్‌ 300 టోర్నీ నుంచి నిలకడగా విజయాలు సాధించకపోతే సీనియర్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ ఒలింపిక్‌ ఆశలు గల్లంతవ్వడం ఖాయం.

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఏప్రిల్‌ 26 ఆఖరి తేదీ. నిబంధనల ప్రకారం టాప్‌-16లో ఉన్న షట్లర్లు ప్రతి విభాగం నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక అవుతారు. ప్రస్తుతం సైనా 22, శ్రీకాంత్‌ 23వ స్థానాల్లో ఉన్నారు. నిర్దేశిత గడువులోగా వీరి ర్యాంకులు మెరుగవ్వకపోతే టోక్యో వెళ్లడం కష్టం. ఇప్పటికైతే పీవీ సింధు (6వ ర్యాంకు), సాయి ప్రణీత్‌ (11వ ర్యాంకు), పురుషుల డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి (8వ ర్యాంకు)కు ఢోకా లేనట్టే.

తమ ప్రదర్శనను మెరుగు పర్చుకొనేందుకు సైనా, శ్రీకాంత్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్ లీగ్‌ నుంచి తప్పుకున్నారు. కఠోర సాధన చేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. ఐతే మలేసియా ఓపెన్లో వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. ఏప్రిల్‌ లోపు థాయ్‌ల్యాండ్‌ సహా 8 టోర్నీలు ఉన్నాయి. వీటిల్లో క్రమం తప్పకుండా గెలుస్తూ టాప్‌-16లోకి చేరుకోవాలి. లేదంటే ఆశలు గల్లంతే. మహిళలు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ పరిస్థితి తెలియదు.

ఇవీ చూడండి.. ధోనీకి ప్రత్యామ్నాయం అతడే: అక్తర్​

Last Updated : Feb 17, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details