అర్జున అవార్డుకు వరుసగా రెండో ఏడాది భారత షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) సిఫార్సు చేయకపోవడంపై స్పందించారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్. అతడి పేరును ప్రతిపాదించాలని సూచించారు. అయితే జూన్ 3వ తేదీనే ఈ విషయాన్ని గోపిచంద్ చెప్పినట్లు.. భారత బ్యాడ్మింటన్ సంఘానికి(బీఏఐ) సంబంధించిన ఓ అధికారి తెలిపారు.
'అర్జున అవార్డుకు ప్రణయ్‌ను నామినేట్ చేయాలి' - ప్రణయ్ పేరును సూచించిన గోపిచంద్
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ పేరును ప్రతిపాదించాలని సూచించారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం వల్ల వరుసగా రెండో ఏడాది ప్రణయ్ పేరును సిఫార్సు చేయలేదు బీఏఐ.
ప్రణయ్, గోపిచంద్
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి , సమీర్ వర్మ పేర్లను అర్జున అవార్డు కోసం కేంద్రానికి పంపించింది బీఏఐ. క్రమశిక్షణ ఉల్లంఘనల చర్యల కింద ప్రణయ్ పేరును చేర్చలేదు. అయితే ఈ కారణం చేత బీఏఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ప్రణయ్. దీనిపై స్పందించిన బీఏఐ.. షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 15 రోజుల్లో ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలిపింది.
ఇది చూడండి :ప్రమాదంలో వికెట్‌కీపర్ కారు నుజ్జు నుజ్జు