తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌: సెమీస్​ చేరిన సాత్విక్- చిరాగ్ జోడీ - French Open 2019

ఫ్రెంచ్​ ఓపెన్​లో భారత యువ షట్లర్లు సాత్విక్​ రాంకీరెడ్డి, చిరాగ్​ శెట్టి సంచలనం సృష్టించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో డెన్మార్క్​ ద్వయంపై విజయం సాధించి సెమీఫైనల్​ చేరారు.

ఫ్రెంచ్‌ ఓపెన్‌: సెమీస్​ చేరిన సాత్విక్-చిరాగ్ జోడీ

By

Published : Oct 25, 2019, 11:49 PM IST

భారత షట్లర్లు సాత్విక్​ రాంకీరెడ్డి, చిరాగ్​ శెట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్​ క్వార్టర్స్​ ఫైనల్​ మ్యాచ్​లో సంచలన విజయం నమోదు చేశారు. ఫలితంగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టారు.

క్వార్టర్​ ఫైనల్లో 21-13, 22-20 తేడాతో కిమ్ అస్ట్రప్-ఆండ్రెస్ (డెన్మార్క్​) జోడీపై గెలిచింది సాత్విక్​, చిరాగ్ ద్వయం​. తర్వాతి మ్యాచ్​లో లి జున్​-లియు చెన్​ (చైనా), హిరోయికి, యుటా వాటాంబే (జపాన్​) మ్యాచ్​లో గెలిచిన జట్టుతో తలపడతారు.

ప్రపంచ నెం.2 జోడీపై...

గురువారం జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్​లో సాత్విక్-చిరాగ్ జోడీ... ప్రపంచ రెండో ర్యాంకర్లను ఓడించారు. ఈ మ్యాచ్​లో 21-18, 18-21, 21-13 తేడాతో మహమ్మద్ అహ్సస్-హెండ్రా సెటివాన్‌ (ఇండోనేషియా)పై విజయం సాధించి క్వార్టర్​ ఫైనల్లో అడుగుపెట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details