ప్యారిస్ వేదికగా జరగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో... మాజీ ప్రపంచ నెం.1 సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వరుససెట్లలో పరాజయం చెందింది.
ఫ్రెంచ్ ఓపెన్: క్వార్టర్స్‌లో ముగిసిన సైనా పోరాటం - saina nehwal vs an se young, french open 2019, french open badminton live scores, saina nehwal french open 2019, an se young vs saina nehwal highlights, french open live score, badminton live score, india badminton news, badminton news telugu
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరుత్సాహపరిచింది. పతకంపై ఆశలతో టోర్నీలో అడుగుపెట్టిన తెలుగుతేజం... క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది.
గత వారం డెన్మార్క్ ఓపెన్‌లో సింధును ఓడించిన అన్‌సే యంగ్ (దక్షిణకొరియా)... ఈ టోర్నీలో సైనాకు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన పోరులో 20-22, 21-23 తేడాతో అన్‌సే యంగ్ (కొరియా) చేతిలో ఖంగుతింది సైనా. గాయం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన 7వ సీడ్ సైనా... ఈ సూపర్ 750 టోర్నీలో గట్టి ప్రత్యర్థులైనా చెంగ్ న్యాన్ యి (హాంకాంగ్), లియానే (డెన్మార్క్)లను ఓడించింది. ఇటీవల పాల్గొన్న మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌కే పరిమితమైంది. కానీ ఈ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వెళ్లింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత పీవీ సింధు...తర్వాతి మ్యాచ్‌లో టాప్ సీడ్ తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఇటీవల ముగిసిన డెన్మార్క్, చైనా, కొరియా ఓపెన్లలో ఈ ప్లేయర్ చేతిలోనే సింధు ఓడిపోయింది.