మయామి ఓపెన్‌లో తనదైన ఆటతీరు ప్రదర్శించాడు స్విట్జర్లాండ్ ఆటగాడు ఫెదరర్. సెమీస్‌లో డెనిస్ షపోవలోవ్ని 6-2,6-4 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరాడు.
మరో సెమీ ఫైనల్లో అగర్ అలియాసిమేపై 7-6(7/3), 7-6 (7/4) తేడాతో గెలిచాడు జాన్ ఇస్నర్. గతేడాది విజేతగా నిలిచిన ఇస్నర్‌కు అగర్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫైనల్లో ఫెదరర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడీ టెన్నిస్ స్టార్.