కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేంత వరకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ఎటువంటి టోర్నీలు నిర్వహించకూడదని సూచించాడు భారత్ షట్లర్ సాయి ప్రణీత్. ప్రస్తుత పరిస్థితుల్లో బీడబ్ల్యూఎఫ్ అప్రమత్తంగా ఉండాలని అన్నాడు.
"బీడబ్ల్యూఎఫ్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి టోర్నీలు నిర్వహించకూడదు. ప్రతి నిర్ణయం ఆచితుచి తీసుకోవాలి. అయినా ఒకవేళ షెడ్యూల్ ప్రకారం టోర్నీలు పునఃప్రారంభించినా సజావుగా సాగడం అసాధ్యం. ఇది ఆటగాళ్లకు ఓ సవాల్ లాంటిది. లాక్డౌన్ కారణంగా ఇంతకాలం ఇంటికే పరిమితమైన అథ్లెట్లు ఫిట్నెస్ కోల్పోయి ఉంటారు. మళ్లీ ఫామ్లోకి రావాలంటే దాదాపు రెండు నెలల సమయం పడుతుంది."
భారత ఆటగాళ్లకు నిలకడగా రాణించగలిగే సత్తా ఉందా?
భారీ ఈవెంట్లలో భారత షట్లర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. ఆ లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే శిక్షణ పొందటానికి సౌకర్యాలు బాగానే ఉన్నాయి.