కొవిడ్ కారణంగా వాయిదా పడిన దేశవాళీ బ్యాడ్మింటన్ పోటీలు(Domestic Badminton) వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 20 నెలల విరామం తర్వాత ఇవి తిరిగి మొదలవుతాయని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(BAI News) పేర్కొంది. తొలి టోర్నీ డిసెంబర్ 16-22 మధ్య చెన్నై వేదికగా జరగనున్నట్లు స్పష్టం చేసింది.
తొలి టోర్నీ తర్వాత డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్లో మరో లెవల్ 3 టోర్నీ కూడా జరగనుందని బీఏఐ(Domestic badminton tournaments in india) పేర్కొంది. రెండు టోర్నీలకు రూ. 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉందని తెలిపింది.
చెన్నై టోర్నీకి నవంబర్ 24లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, హైదరాబాద్ టోర్నీకి డిసెంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే.. దేశవాళీ బ్యాడ్మింటన్ టోర్నీలను కొవిడ్ నిబంధనల మధ్యే నిర్వహిస్తామని తెలిపారు బీఏఐ సెక్రటరీ అజయ్ కే సింగనియా. టోర్నీల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగటివ్ రిపోర్టు తీసుకురావాలని స్పష్టం చేశారు.
సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో మూడు భాగాలుంటాయి.
- లెవల్ 3, బీఏఐ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ(ఏడాదిలో ఆరు సార్లు)
- లెవల్ 2, బీఏఐ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ(ఏడాదిలో నాలుగు సార్లు)
- లెవల్ 1, బీఏఐ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ(ఏడాదిలో రెండు సార్లు)