తైవాన్‌కు చెందిన పదేళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి కరోనా వైరస్ సోకిందని డెన్మార్క్ మాజీ ఆటగాడు హెచ్‌కె విట్టింగస్ తెలిపాడు. తాజాగా ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో తైవాన్ జట్టుకు సహాయ సభ్యురాలిగా పాల్గొనేందుకు ఆమె బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. అక్కడ జరిపిన కరోనా నిర్ధరణ పరీక్షలో వైరస్ సోకినట్లు తేలింది.
ఈ విషయం తెలిసిన భారత షట్లర్లు సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ పరిణామంతో షాక్‌కు గురైనట్టు తమ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. దీనిపై పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్ కూడా స్పందించారు. ఇంగ్లాండ్ ప్రభుత్వంతో పాటు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కరోనా నియంత్రణపై వైఫల్యం చెందాయని పుల్లెల గోపీచంద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.