కోచ్‌లు, సహాయక సిబ్బందిపై లాక్‌డౌన్ ప్రభావం గట్టిగా పడిందని, గత మూడు నెలలుగా వాళ్లకు సరిగా జీతాలు అందడం లేదని జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అకాడమీలు, క్రీడా సంస్థలకు నిధుల సేకరణ కోసం 'రన్ టు ది మూన్' అనే కార్యక్రమంలో అథ్లెట్లు అశ్విని నాచప్ప, మాలతి కృష్ణమూర్తిలతో కలిసి అతను భాగస్వామి కానున్నాడు. ఇందులో భాగంగా 3,84,400 కిలోమీటర్ల దూరాన్ని (భూమి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం) పూర్తి చేసే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు పరుగు నిర్వహించనున్నారు.
వారిని ఆదుకునేందుకు అంతదూరం 'పరుగు' - badminton news
జీతాల్లేక ఇబ్బందిపడుతున్న కోచ్‌లు, సహాయ సిబ్బంది ఆదుకునేందుకు 'రన్ టూ ది మూన్' అనే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా భూమి, చంద్రుడికి మధ్య ఉన్నంత దూరం పరుగు తీయనున్నారు.
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
అయితే ఈ పరుగులో పాల్గొనాల్సిన వారు.. రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల వ్యవధిలో ఒక్కొక్కరు కనీసం 65 కిలోమీటర్లు పరుగెత్తాలి. ఇలా వచ్చిన విరాళాన్ని వివిధ కోచింగ్ సంస్థలకు అందించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా జీతాల్లేని కోచ్‌లు, సహాయక సిబ్బందికి అండగా నిలవగలమనే నమ్మకం ఉందని గోపీచంద్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: