భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టిజోడీ.. చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. టోర్నీ ఆసాంతం ఎంతో మందికి షాకిచ్చిన ఈ ద్వయం.. ప్రపంచ ఛాంపియన్లు మార్కస్- కెవిన్ (ఇండోనేసియా)లను నిలువరించ లేకపోయారు.
శనివారం జరిగిన సెమీస్లోసాత్విక్- చిరాగ్ జోడీ.. మార్కస్- కెవిన్ చేతిలో 16-21, 20-22 తేడాతో ఓటమి పాలైంది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వీరి చేతిలోనే ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నారు సాత్విక్- చిరాగ్. ఇప్పటి వరకు వీరు ఎనిమిది సార్లు తలపడగా.. అన్నిసార్లు ప్రత్యర్థిదే పైచేయి.