తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​లో​ క్వార్టర్స్​కు సాత్విక్ - చిరాగ్ జోడీ - satwik -chirag qauarters

భారత డబుల్స్ జోడీ సాత్విక్​సాయి రాజ్ - చిరాగ్ శెట్టి.. క్వార్టర్స్​కు చేరింది. రెండో రౌండ్​లో  జపాన్ ద్వయం హిరోయికి - ఎండో యుతాపై గెలిచింది.

సాత్విక్ - చిరాగ్

By

Published : Nov 7, 2019, 5:42 PM IST

Updated : Nov 7, 2019, 8:38 PM IST

చైనా ఓపెన్​లో భారత స్టార్ షట్లర్లందరూ విఫలమవుతున్న వేళ డబుల్స్ జోడీ సాత్విక్ - చిరాగ్ సత్తాచాటుతున్నారు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్​గా నిలిచిన ఈ ద్వయం.. చైనా ఓపెన్​లో క్వార్టర్స్​కు చేరింది. జపాన్​కు చెందిన హిరోయికి - ఎండో యుతాపై రెండో రౌండ్​లో నెగ్గింది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో 21-18, 21-23, 21-11 తేడాతో విజయం సాధించారు సాత్విక్ - చిరాగ్. తొలి సెట్లో కష్టపడి గెలిచినా.. రెండో గేమ్​లో తీవ్రంగా పోరాడి ఓడారు. నిర్ణయాత్మక మూడో సెట్లో విశ్వరూపం చూపించారు. ఆ గేమ్​లో సులభంగా నెగ్గి.. మ్యాచ్​ను కైవసం చేసుకున్నారు.

తర్వాతి మ్యాచ్​లోసాత్విక్ - చిరాగ్.. లీ జు హుయ్ - లియు యు చెన్(చైనా)​తో తలపడనున్నారు​. థాయ్​లాండ్ ఓపెన్​లో ఈ ద్వయం చేతిలోనే ఓడిపోయారు సాత్విక్ - చిరాగ్ జోడీ. క్వార్టర్స్​లో వీరిపై గెలిచి సెమీస్​ చేరాలనే కసితో ఉన్నారు.

ఇదీ చదవండి: ఆ రోజుల్లో అయితే స్మిత్​కు చుక్కలే: అక్తర్

Last Updated : Nov 7, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details