చైనా ఓపెన్‌లో భారత పురుష షట్లర్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్‌కు చేరుకోగా.. స్టార్ ఆటగాడు సాయి ప్రణీత్ ముందంజ వేశాడు. తొలి రౌండ్లో ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్టోపై విజయం సాధించాడు.
చైనా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు ప్రణీత్ - Thailand's Sitthikom Thammasin
బుధవారం జరిగిన చైనా ఓపెన్ తొలి రౌండ్లో గెలిచిన భారత షట్లర్ సాయి ప్రణీత్... రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
చైనా ఓపెన్‌లో రెండో రౌండుకు ప్రణీత్
15-21, 21-10, 21-10 తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు ప్రణీత్. 52 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ తొలి సెట్లో పరాజయం పాలైన భారత షట్లర్... అనంతరం పుంజుకున్నాడు. తర్వాతి రెండు గేముల్లోనూ ఆధిపత్యం సాధించి రెండో రౌండ్‌కు చేరాడు.
ప్రణీత్ తనతర్వాతి మ్యాచ్‌లో డెన్మార్క్ క్రీడాకారుడు ఆండెర్స్ ఆంటోన్సన్తో తలపడనున్నాడు. ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు టోర్నీ నుంచి నిష్క్రమించారు.