తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​ సింగిల్స్​లో భారత్​ పోరు ముగిసెన్

చైనా ఓపెన్​లో భారత స్టార్ షట్లర్ సాయి ప్రణీత్​.. డెన్మార్క్ ప్లేయర్ ఆండెర్స్​పై ఓడాడు. ఈ ఓటమితో సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ల పోరు ముగిసింది.

సాయి ప్రణీత్

By

Published : Nov 7, 2019, 4:12 PM IST

Updated : Nov 7, 2019, 8:37 PM IST

చైనా ఓపెన్​ బ్యాడ్మింటన్ సింగిల్స్​ విభాగంలో భారత్ ప్రయాణం ముగిసింది. ఇప్పటికే స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ నిష్క్రమించగా.. తాజాగా సాయి ప్రణీత్ ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన రెండోరౌండ్​లో డెన్మార్క్​కు చెందిన ఆండెర్స్ ఆంటొన్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో 20-22, 22-20, 16-21 తేడాతో ఓడిపోయాడు ప్రణీత్. నువ్వా, నేనా అంటూ సాగిన తొలి గేమ్​లో ప్రత్యర్థి గెలవగా.. రెండో సెట్​లో విజయం ప్రణీత్​ను వరించింది. నిర్ణయాత్మక మూడో సెట్​లో తీవ్రంగా పోరాడినప్పటికీ ఆండెర్స్​ వ్యూహాల ముందు ప్రణీత్ నిలువలేకపోయాడు. ఫలితంగా మ్యాచ్ చేజార్చుకున్నాడు.

తొలి రౌండ్​లోనే భారత సింగిల్స్ షట్లర్లు ప్రణయ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు టోర్నీ నుంచి వెనుదిరిగారు. గురువారం ఉదయం జరిగిన రెండో రౌండ్​లో పారుపల్లి కశ్యప్​.. 13-21, 19-21 తేడాతో ఓడిపోయాడు. డెన్మార్క్​కు చెందిన విక్టర్ చేతిలో పరాజయం చెందాడు.

గురువారం జరిగిన రెండో రౌండ్​లో డబుల్స్​లో మిక్స్​డ్ జోడీ సాత్విక్ - అశ్విని పొన్నప్ప ఓడారు. కొరియా ద్వయం సియో సియాంగ్ - చే యుజంగ్​ చేతిలో పరాజయం చెంది నిష్క్రమించారు.

ఇదీ చదవండి: విరాట్ కోహ్లీని అధిగమించిన స్మృతి మంధాన

Last Updated : Nov 7, 2019, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details