తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​ సెమీ ఫైనల్​లో సాత్విక్​- చిరాగ్​ జోడీ - Marcus Fernando Gideon and Kevin Sanjaya Sukamuljo.

చైనా ఓపెన్లో భారత పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి ద్వయం సెమీ ఫైనల్​ చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో వరుస సెట్లలో గెలిచి సెమీస్​లో అడుగుపెట్టిందీ జోడీ.

చైనా ఓపెన్​ సెమీఫైనల్లో అడుగుపెట్టిన సాత్విక్​-చిరాగ్​ జోడీ

By

Published : Nov 8, 2019, 1:16 PM IST

డ్రాగన్​ గడ్డపై తెలుగుతేజాలు సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోరు కొనసాగిస్తున్నారు. ఫుజౌ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో... ఈ డబుల్స్‌ జోడీ సెమీఫైనల్​ చేరింది. ఈ రోజు జరిగిన మ్యాచ్​లో మాజీ ప్రపంచ ఛాంపియన్లు లీ జున్ ​హు​-హు చెన్​ (చైనా) జోడీని ఓడించి సత్తా చాటారు. 43 నిముషాలు పాటు సాగిన మ్యాచ్​లో... 21-19, 21-15 తేడాతో తెలుగు జోడీ విజయం సాధించింది.

సెమీఫైనల్​ చేరిన సాత్విక్​- చిరాగ్​ జోడీ.... ఇదే ద్వయంపై గెలిచి ఇటీవల థాయ్​లాండ్​ ఓపెన్​ టైటిల్​ కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది మూడోసారి ప్రపంచ టూర్ టోర్నీల్లో​ సెమీఫైనల్​ చేరిందీ తెలుగు జోడీ. తర్వాతి మ్యాచ్​లో మార్కస్​ ఫెర్నాండ్​, కెవిన్​ సంజయా (ఇండోనేషియా) జోడీతో తలపడనున్నారు.

ABOUT THE AUTHOR

...view details