ప్రముఖ షట్లర్ కరోలినా మారిన్.. చైనా ఓపెన్ విజేతగా నిలిచింది. దాదాపు ఎనిమిది నెలల అనంతరం బరిలోకి దిగిన ఈ షట్లర్.. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో తై జు యింగ్(చైనీస్ తైపీ)పై 14-21, 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది.
మోకాలి శస్త్రచికిత్స తర్వాత 8 నెలల విశ్రాంతి తీసుకున్న మారిన్... జనవరి తర్వాత మళ్లీ ఇప్పుడే రాకెట్ పట్టింది. వచ్చి రాగానే టైటిల్ గెలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్లో సైనాతో మ్యాచ్ సందర్భంగా గాయపడిందీ క్రీడాకారిణి. వియత్నాం ఓపెన్లోనూ బరిలోకి దిగిన ఈ స్టార్... సుపానిదా కేట్థాంగ్(థాయ్లాండ్) చేతిలో తొలి రౌండ్లోనే ఓడిపోయింది.