స్విస్ ఓపెన్ ఫైనల్లో భారత షట్లర్ పీవీ సింధు పరాజయం పొందింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తుదిపోరులో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌పై 21-12, 21-5 తేడాతో ఓటమి పాలైంది.
అంతర్జాతీయ టోర్నీల్లో పీవీ సింధు, కరోలినా మారిన్ ఇప్పటివరకు 14 సార్లు తలపడ్డారు. రెండేళ్ల తర్వాత వారిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్.. బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లోనూ వీరిద్దరూ పోటీపడ్డారు. అయితే అందులో సింధు ఓటమి పాలై.. రజత పతకాన్ని దక్కించుకుంది.