PV Sindhu World Tour Finals: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మొదటి రౌండ్లో డెన్మార్క్ క్రీడాకారిణి లినే క్రిస్టోఫెర్సెన్పై 21-14, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సింధు. ఇక శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన టోమా జూనియర్ పొపోవ్‌పై 21-14, 21-16 తేడాతో గెలిచి టోర్నీలో ముందంజ వేశాడు.
రెండో రౌండ్లో జర్మనీకి చెందిన యూవొన్నే లీతో సింధు తలపడనుండగా.. థాయ్‌లాండ్ షట్లర్ కున్లవత్తో పోటీపడనున్నాడు శ్రీకాంత్.