తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్​ ఫైనల్స్​లో సింధు సాధించేనా? - బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ టూర్​ ఫైనల్స్

BWF tour finals 2021: బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ టూర్​ ఫైనల్స్​ నేడు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజయం సాధించి.. ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని స్టార్​ షట్లర్​ పీవీ సింధు భావిస్తోంది. ఇక ఈ మెగాటోర్నీలో భారత్​ తరఫున మొత్తంగా ఏడుగురు క్రీడాకారులు బరిలో ఉండటం ఇదే ప్రథమం.

పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ టూర్​ ఫైనల్స్,  BWF World Tour Finals,   PV Sindhu  BWF World Tour Finals
పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ టూర్​ ఫైనల్స్

By

Published : Dec 1, 2021, 6:31 AM IST

Updated : Dec 1, 2021, 11:56 AM IST

PV Sindhu bwf 2021: టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌పై గురిపెట్టింది. వరుసగా మూడు టోర్నీల్లో సెమీస్‌ చేరుకున్న ప్రపంచ ఛాంపియన్‌ సింధు.. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని భావిస్తోంది. బుధవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు ఫేవరెట్‌లలో ఒకరుగా బరిలో దిగుతుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, యువ ఆటగాడు లక్ష్యసేన్‌ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టి, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప పోటీలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్‌ తరఫున ఏడుగురు క్రీడాకారులు బరిలో ఉండటం ఇదే ప్రథమం.

2018లో విజేతగా నిలవడం ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో సింధు అత్యుత్తమ ప్రదర్శన. 2016లో సెమీస్‌, 2017లో ఫైనల్‌ చేరుకున్న సింధు.. 20019, 2020లలో గ్రూపు దశ దాటలేదు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటం.. ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఇండోనేసియా మాస్టర్స్‌, ఇండోనేసియా ఓపెన్‌లలో సెమీస్‌ చేరుకుని నిలకడగా రాణించడం వల్ల సింధుపై అంచనాలు పెరిగాయి. గ్రూపు-ఎలో సింధుతో పాటు పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌), లైన్‌ క్రిస్టోఫెర్సెన్‌ (డెన్మార్క్‌), యోనె లీ (జర్మనీ) ఉన్నారు. బుధవారం తొలి పోరులో క్రిస్టోఫెర్సెన్‌తో సింధు తలపడనుంది. గ్రూపు-బిలో అకానె యమగూచి (జపాన్‌), బుసానన్‌ (థాయ్‌లాండ్‌), ఆన్‌ సియాంగ్‌ (కొరియా), జియా మిన్‌ (సింగపూర్‌) బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌ గ్రూపు-ఎలో లక్ష్యసేన్‌, విక్టర్‌ అక్సల్సెన్‌ (డెన్మార్క్‌), కెంటొ మొమట (జపాన్‌), రస్‌ముస్‌ గెమ్కీ (డెన్మార్క్‌).. గ్రూపు-బిలో శ్రీకాంత్‌, లీ జియా (మలేసియా), టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌), కున్లవుత్‌ వితిద్సర్న్‌ (థాయ్‌లాండ్‌) పోటీలో ఉన్నారు.

ఇదీ చూడండి:Indonesia Open semi finals 2021: నిరాశపరిచిన సింధు.. సెమీస్​లో ఓటమి

Last Updated : Dec 1, 2021, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details