'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్'లో అతికష్టం మీద చోటు దక్కించుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ.సింధు. బుధవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాంగ్జుకు చేరుకున్న షట్లర్లకు ఘనమైన ఆతిథ్యమిచ్చింది అక్కడి ప్రభుత్వం. టాప్-8 షట్లర్లు అంతా కలిసి ఆరంభ వేడుకలో సందడి చేశారు.
మొదటి మ్యాచ్‌లోనే టాప్ ప్లేయర్ యమగూచి(జపాన్)తో తలపడనుంది సింధు. వీరిద్దరూ గతంలో 16 సార్లు పోటీపడగా.. 10 విజయాలు, 6 ఓటములు ఖాతాలో వేసుకుంది మన తెలుగమ్మాయి.
ఆరో సీడ్ సింధుతో పాటు చైనా షట్లర్లు చెన్ యుఫీ, హీ బింగ్జీవో, జపాన్ షట్లర్ యమగూచి గ్రూప్-ఏలో ఉన్నారు. గ్రూప్-బిలో ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తై జు యింగ్, మాజీ ఛాంపియన్ ఒకుహరతో పాటు థాయిలాండ్‌కు చెందిన బుసనన్ చోటు దక్కించుకున్నారు.