BWF World Championships: బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. ప్రపంచ టాప్, చైనాకు చెందిన సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో వరుస సెట్లలో 21-17, 21-13 తేడాతో ఓటమి పాలైంది. దీంతో సింధు టైటిల్ ఆశలు చేజారాయి. హెడ్ టూ హెడ్ మ్యాచ్‌ల్లో 15-5 తేడాతో సింధు కంటే ముందంజలో ఉంది తై జు యింగ్.
గతేడాది టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్లోనూ తై జు యింగ్ చేతిలోనే ఓటమి చవిచూసింది సింధు.
PV Sindhu World Championship: అంతకు ముందు గురువారం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ప్రపంచ పదో సీడ్ చోచువాంగ్‌పై 21-14, 21-18తో ఏడో సీడ్ సింధు విజయం సాధించి.. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
శ్రీకాంత్ విజయం..
BWF World Championships: బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లో భారత షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ మార్క్ కాలిజోపై 21-8, 21-7 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం ఖరారు చేసుకున్నాడు. తద్వారా ఈ టోర్నీలో మెడల్ సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. స్పెయిన్‌లోని హుయెల్వాలో సెమీఫైనల్ జరగనుంది.
లక్ష్యసేన్‌కు పతకం ఖరారు..
మరోవైపు భారత షట్లర్ లక్ష్యసేన్‌కు పతకం ఖరారైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకుచెందిన జున్ పెంగ్ జావోపై 21-15, 15-21, 22-20 తేడాతో విజయం సాధించాడు. సెమీఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.
ఇక మరో షట్లర్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. సింగపుర్‌కు చెందిన కీన్ యూ లోహ్పై 14-21, 12-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.
ఇదీ చూడండి:ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్