BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, శ్రీకాంత్ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చోచువాంగ్‌పై వరుస సెట్లలో నెగ్గి నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది సింధు.
గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ప్రపంచ పదో సీడ్ చోచువాంగ్‌పై 21-14, 21-18తో ఏడో సీడ్ సింధు విజయం సాధించింది. ఈ విజయంతో సింధు ఆరో సీడ్లోకి అడుగుపెట్టింది. హెడ్ టు హెడ్ రికార్డ్ల్లోనూ చోచువాంగ్‌పై సింధు 5-3తో ముందంజలో నిలిచింది.