భారత దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణెకు (Prakash Padukone Badminton) జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్). అవార్డు కమిషన్ సిఫార్సుల మేరకు ఆయన పేరును ఖరారు చేసింది (BWF News) బీడబ్ల్యూఎఫ్. ఈ అవార్డు కోసం ప్రకాశ్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) ప్రతిపాదించింది.
ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న ప్రకాశ్.. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పతకం సాధించిన తొలి భారత షట్లర్. ఆట కోసం ఆయన ఎన్నో సేవలందించారు. ఈ నేపథ్యంలోనే 2018లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది (BAI News) భారత బ్యాడ్మింటన్ సంఘం.