తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటగాళ్ల ర్యాంకులపై బీడబ్ల్యూఎఫ్ కీలక నిర్ణయం - BWF freezes rankings due to corona effect

కరోనా నేపథ్యంలో సీనియర్, జూనియర్ ర్యాంకింగ్స్​ను అలాగే నిలిపి వేయాలని నిర్ణయించింది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య. ఫలితంగా ఆటగాళ్లు మార్చి 17 వరకు ఏ ర్యాంకుల్లో ఉంటే ఆ ర్యాంకుల్లోనే కొనసాగనున్నారు.

BWF
బ్యాడ్మింటన్

By

Published : Apr 1, 2020, 10:35 AM IST

కరోనా వైరస్‌ కారణంగా టోర్నీలన్నీ వాయిదా పడడం వల్ల క్రీడాకారుల ర్యాంకింగ్స్‌ను స్తంభింపచేయాలని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది. దీని ప్రకారం మార్చి 17 వరకు ఎవరు ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకులోనే కొనసాగనున్నారు. తర్వాత నిర్వహించే టోర్నీల్లో పాల్గొనడానికి లేదా సీడింగ్‌ ఇవ్వడానికి ఈ ర్యాంకులు ఉపయోగపడతాయని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది.

"తదుపరి నోటీసు ఇచ్చే వరకు ప్రపంచ సీనియర్‌, జూనియర్‌ ర్యాంకింగ్స్‌ను అలాగే నిలిపి వేయాలని నిర్ణయించాం. ఆ ఏడాది చివరగా ఆడిన ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ టోర్నీ తర్వాత షట్లర్లు ఏ ర్యాంకుల్లో ఉంటే వాటిని అలాగే ఉంచుతాం. వాయిదా లేదా రద్దయిన టోర్నీలు మే లేదా జూన్‌లో నిర్వహించే ఆలోచన చేస్తున్నాం. మళ్లీ ర్యాంకులను విడుదల చేయడం అనేది టోర్నీల క్యాలెండర్‌ నిర్ణయమైన తర్వాతే జరుగుతుంది. టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జులై 23న ఆరంభం అవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ వెల్లడించిన నేపథ్యంలో ఈ క్రీడల క్వాలిఫికేషన్‌ పక్రియను సమీక్షిస్తున్నాం."

-బీడబ్ల్యూఎఫ్‌

కరోనా కారణంగా ఇండియా ఓపెన్‌, మలేసియా ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌ లాంటి కీలక టోర్నీలను ఏప్రిల్‌ 12 వరకు వాయిదా వేయాలని సమాఖ్య ఇంతకుముందు నిర్ణయించింది. అయితే టోర్నీల వాయిదాతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టం అవుతుందని భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details