మన దేశంలో జరగాల్సిన ఇండియా ఓపెన్ సూపర్ 500, హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 టోర్నీలను రద్దు చేస్తూ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మిగిలిన సీజన్‌కు సంబంధించి అంతర్జాతీయ క్యాలెండర్‌ను పునరుద్ధరించింది.
టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీ ఇండియా ఓపెన్ మే 11-16 వరకు జరగాల్సింది. కొవిడ్ కారణంగా ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ప్రకటించింది బీడబ్ల్యూఎఫ్. హైదరాబాద్ ఓపెన్‌ను ఆగస్టు 24-29 వరకు నిర్వహించాల్సి ఉండగా.. కొవిడ్ వల్ల ఆ టోర్నీని రద్దు చేసింది. సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ షెడ్యూల్ ప్రకారమే జరగనుందని ప్రకటించింది. లక్నవూ వేదికగా అక్టోబర్ 12-17 వరకు ఈ టోర్నీ జరగనుంది.