తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​ కీ లక్ష్మీ' ప్రచారకర్తలుగా దీపికా, సింధు - Diwali festival

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 'భారత్ ​కీ లక్ష్మీ' కార్యక్రమానికి ప్రచారకర్తలుగా నియమితులయ్యారు  ప్రముఖ షట్లర్​ పీవీ సింధు, బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె. ఈ కార్యక్రమంలో భాగంగా దీపావళి రోజున మహిళలు సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయనున్నారు.

'భారత్​కీ లక్ష్మీ' ప్రచారకర్తలుగా దీపికా, సింధు

By

Published : Oct 22, 2019, 4:43 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దీపావళి రోజున 'భారత్ ​కీ లక్ష్మీ' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి ప్రచారకర్తలుగా ప్రముఖ షట్లర్​ పీవీ సింధు, బాలీవుడ్​ నటి దీపికా పదుకొణెలను నియమించింది ప్రభుత్వం. వీరిద్దరిని భాగస్వామ్యం చేస్తూ ఓ వీడియోనూ రూపొందించింది. మహిళలు సాధించిన విజయాలు, ప్రగతికి మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు.

'భారత్​ కీ లక్ష్మీ' హ్యాష్​ట్యాగ్​తో ఆడవాళ్లు సాధించిన అద్భుత విజయాలను షేర్​ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. మహిళా శక్తిని గౌరవించి పండుగను మరింత శోభాయమానంగా చేసుకోవాలని.. 57వ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో ఆయన ఉద్ఘాటించారు.

మహిళా సాధికారత వల్ల సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు పీవీ సింధు, దీపికా. దీపావళి సందర్భంగా చేపట్టనున్న భారత్ ​కీ లక్ష్మీ కార్యక్రమానికి వీరిద్దరూ మద్దతు తెలిపారు.

"మహిళలు ప్రగతి పథంలో పయనిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. వాళ్ల నిర్ణయాలకు మనం సరైన స్థానం కల్పించాలి. మోదీ చేపడుతోన్న భారత్ ​కీ లక్ష్మీ ప్రచారానికి నేను మద్దతిస్తున్నాను. దేశంలో మహిళలు సాధించిన అద్భుత విజయాల వేడుకలను ప్రత్యేకంగా జరుపుకొందాం. ఈ దీపావళిని మహిళాశక్తితో నింపేద్దాం"
- సింధు ట్వీట్​

ఈ ఏడాది ఆగస్టు 25న బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్​గా రికార్డు నెలకొల్పింది.

15 ఏళ్ల వయసులో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ అనే మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న'ఛపాక్'​ సినిమాలో నటించింది దీపికా. విక్రాంత్‌ మస్సే ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నాడు .'రాజీ’ ఫేం మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి దర్శకురాలు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా.. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details