తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచ ఛాంపియన్'​ పీవీ.సింధుకు బాయ్​ నజరానా

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​ విజేతగా నిలిచిన సింధుకు రూ.20 లక్షలు, ఇదే టోర్నీ పురుషుల విభాగంలో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్​కు రూ.5 లక్షలు నజరానా ప్రకటించింది బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్).

'ప్రపంచ ఛాంపియన్'​ పీవీ.సింధుకు బాయ్​ నజరానా

By

Published : Aug 26, 2019, 5:46 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

స్విట్జర్లాండ్​ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో జగజ్జేతగా నిలిచింది తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు. అయితే ఛాంపియన్​గా నిలిచిన సింధుకు రూ.20 లక్షలు, సెమీస్​లో నిష్క్రమించిన సాయి ప్రణీత్​కు రూ.5 లక్షలు నజరానా ప్రకటిస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) ట్వీట్ చేసింది.

"బాయ్ అధ్యక్షుడు హిమంత్ బిస్వా.. ప్రపంచ ఛాంపియన్​ పీవీ సింధుకు రూ.20 లక్షలు, అద్భుతంగా ఆడినందుకు సాయి ప్రణీత్​కు రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. #bwfwordchampionship2019" -ట్విట్టర్​లో భారత బ్యాడ్మింటన్​ అసోసియేషన్

భారత బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ట్వీట్

ఈ టోర్నీలో తొలిసారి స్వర్ణం చేజిక్కుంచుకున్న భారత ప్లేయర్​గా నిలిచింది సింధు. అదే విధంగా ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో అత్యధిక పతకాలు సాధించిన వారిలో చైనాకు చెందిన జంగ్ నింగ్(చైనా)​ సరసన నిలిచింది తెలుగుతేజం.

పురుషుల విభాగంలో సెమీస్​లో అడుగుపెట్టిన సాయిప్రణీత్​.. దాదాపు 36 ఏళ్ల తర్వాత కాంస్యం పతకం అందుకు భారతీయుడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ప్రకాశ్ పదుకునే పేరిట ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 28, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details