మలేసియా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లీ చాంగ్ వీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్యాన్సర్ బారిన పడిన లీ తన జీవితంలోనే కఠిన నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపాడు. కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్న ఈ స్టార్ ఆటగాడు ఒలింపిక్స్లో పసిడి పతకాన్ని మాత్రం పొందలేకపోయాడు.
"నా జీవితంలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నా. బ్యాడ్మింటన్ ఆటను ఎంతగానో ప్రేమిస్తున్నా. 19 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న మలేసియా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా" - లీ చాంగ్ వీ, మలేసియన్ షట్లర్.
భవిష్యత్తులో విశ్రాంతి తీసుకుంటూ... కుటుంబంతో గడుపుతానని చెప్పాడు లీ చాంగ్.
"నేను ఒలింపిక్స్ అనంతరం రిటైరవుదామనుకున్నా. కానీ క్యాన్సర్ కారణంగా ముందుగానే వైదొలుగుతున్నా. కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకుంటా" -లీ చాంగ్ వీ, మలేసియన్ షట్లర్.