ఈ ఏడాది జరగాల్సిన బ్యాడ్మింటన్ యూఎస్ ఓపెన్, కెనడా ఓపెన్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) ప్రకటించింది. కొవిడ్ నిబంధనలు, పరిమితుల కారణంగానే టోర్నీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
జులై 6 నుంచి 11 వరకు సూపర్ 300 టోర్నమెంట్ యూఎస్‌లో జరగాల్సి ఉంది. జూన్ 29 నుంచి జులై 4 వరకు కెనడా వేదికగా సూపర్ 100 టోర్నమెంట్‌ను తలపెట్టారు.
"కరోనా పరిమితులు, నిబంధనల కారణంగా టోర్నీని నిర్వహించే అవకాశం లేదు. టోర్నీ రద్దు తప్ప ప్రత్యామ్నాయం లేదు. సంబంధిత దేశాలు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్యతో తమ నిర్ణయాన్ని వెలువరించాయి."