డెన్మార్క్‌లో వచ్చే నెలలో జరగాల్సిన 'థామస్ అండ్ ఉబెర్ కప్' టోర్నీ వాయిదా పడింది. స్టార్ షట్లర్ పీవీ సింధు సహా పలువురు స్టార్ ప్లేయర్లతో కూడిన బృందాలు వైదొలగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) మంగళవారం వెల్లడించింది.షెడ్యూల్ ప్రకారం డెన్మార్క్‌లోని అర్హస్‌లో అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగాల్సింది.
సైనా విమర్శలు..
వ్యక్తిగత కారణాలతో సింధు పోటీలకు దూరం కాగా.. కరోనా నేపథ్యంలోనూ ఆరోగ్య భద్రత లేకుండా టోర్నీ నిర్వహణ ఏంటని..? సైనా నెహ్వాల్ ఇప్పటికే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా దేశాలకు చెందిన ఆటగాళ్లు మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులు, ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని రాలేమని స్పష్టం చేశారు. ఫలితంగా టోర్నీ రద్దయింది. ఈ టోర్నీతో బ్యాడ్మింటన్ పునరుద్ధరణ అవుతుందని ఆశించారు. కానీ ఈ పోటీలు వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు సమాచారం.